సాక్షి వర్సెస్ ఈనాడు

ఆనాడు ఈనాడు గురించి ఎన్టీ రామారావు ఎలా ఈసడించుకున్నారో సాక్షి వివరంగా రాసింది. ఈరోజు ఈ రెండు పత్రికలను దగ్గర పెట్టుకుని చదివిన వారికి రాజకీయాలంటే, జర్నలిజమంటే వాంతి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏది నిజం, ఏది అబద్ధం? అది ఖచ్చితంగా చెప్పలేం. ఏది స్వార్ధం అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రెండు పక్షాలూ స్వార్ధంతోనే వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని సాక్షి, వైఎస్ సిఎం కాకూడదన్న లక్ష్యంతో ఈనాడు పనిచేస్తున్నాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడ విలువల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఈ చిలవలు పలవలు ఇంకా మరికొన్ని గంటల పాటు భరించక తప్పదు.












Click it and Unblock the Notifications