టిటిడి చైర్మన్ కు చిరు తీర్ధం?

చిత్తూరు జిల్లాలోని రెండు ఎంఫీ స్ధానాలు ఎస్ సి లకు రిజర్వు కావడంతో ఆదికేశవులుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ లభించడం కష్టమని తేలిపోయింది. టిటిడి పోస్టు ఇచ్చాం కదా, మళ్ళీ ఎంపీ టికెట్ ఎందుకు అన్నట్టు వైఎస్ ఆదికేశవులుకు సంకేతాలు ఇవ్వడంతో ఆ పెద్దాయన మరో పార్టీ టికెట్ కోసం అన్వేషించారు. తన వాళ్ళ పార్టీ అయిన ప్రజారాజ్యం తరఫున ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆదికేశవులు నాయుడు తలచుకుంటే కనీసం వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వస్తుందన్న ఆశతో ప్రజారాజ్యం అగ్ర నాయకులు ఆయన ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి సాధ్యం కాదు. తమిళనాడు లేదా కర్నాటక లోని ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి వస్తానని ఆదికేశవులు నాయుడు రాయబారాలు పంపుతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications