Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామోజీరావుపై పోరుకు మళ్ళీ ఉండవల్లి సై

Undavalli Arun kumar
కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రామోజీరావుపై యుద్ధం ప్రకటించారు. గతంలో ఆయన మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలను బయటపెట్టి రామోజీరావు తన సంస్ధలోని కొంత వాటాను కంపానీ గ్రూపునకు అమ్ముకునేలా తీవ్ర వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. రామోజీరావుపై ఉండవల్లి ఉన్నది వ్యక్తిగత వైరం కాదు, జాతి వైరం.

కాపు, బిసి నాయకుడు వంగవీటి రంగా టిడిపి హయాంలో హత్యగావించబడినప్పటి నుంచి కమ్మ వ్యతిరేక శక్తులను రాజశేఖరరెడ్డి దగ్గరికి తీయడం మొదలు పెట్టారు. అలాగే బ్రాహ్మణ విద్యాధికులు కూడా వైఎస్ కు దగ్గరయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్ కు వెన్నుదన్నుగా ఉండి, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ విజయవంతమయ్యేలా చూసింది ఈ కమ్మ వ్యతిరేక శక్తులే.

గత ఎన్నికల్లో తనను ఓడించడానికి రామోజీరావు తన మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తా రని ఉండవల్లి అరుణ్ కుమార్ భయపడిన మాట వాస్తవమే. కానీ వైఎస్ వేవ్ లో ఉండవల్లి గెలిచేశారు. ఆయన వైఎస్ మరణించిన తర్వాత మౌనం వహించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ లేని కాంగ్రెస్ రామోజీని ఎదుర్కోలేదన్న భయం ఉండవల్లిలో ఉండింది. కానీ అలా భయపడుతూ కూర్చుంటే రామోజీరావు తనను తినేస్తాడన్న భయం కూడా ఉండవల్లికి ఉంది. అందువల్ల నిన్న సాయంత్రం సాక్షి టీవీ కార్యక్రమంలో ఆయన రామోజీపై తన సమరం నిలిచిపోలేదని ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+