ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఇక సినిమాల్లో నటించబోనని ఒక ప్రకటన చేశేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నటించారు. ఆయన 1989 లో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రంలో నటించారు. 1991 లో 'సామ్రాట్ అశోక్' లో నటించారు. మళ్ళీ సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకులకు దగ్గరై ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. నిన్న మొన్నటి వరకు పాత్ర నచ్చితే కొన్ని సినిమాలు చేస్తానని చెబుతూ వచ్చిన చిరంజీవి హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన అభిమానులు చాలా మంది దిగ్భ్రాంతి చెంది ఉంటారు.
చిరంజీవి లెక్కలు చిరంజీవికి ఉన్నాయి. ఎన్టీ రామారావు లాగా రాజకీయాల్లో తాను వచ్చే రాగానే విజయం సాధించలేకపోయాడు. తిరిగి సినిమాలు ఒప్పుకుంటే అక్కడ విఫలమై ఇక్కడికి తిరిగి వచ్చాడన్న విమర్శలు వస్తాయేమోనని చిరంజీవి భయం కావచ్చు.