జగన్ వేరు కుంపటి?

పార్టీ అధిష్ఠాన వర్గం జాప్యాన్ని కూడా వైయస్ వర్గం సహించే స్థితిలో లేనట్లు కనిపిస్తోంది. శుక్రవారంనాడు కాకినాడ కాంగ్రెసు శాసనసభ్యుడు చంద్రశేఖర రెడ్డి మాట్లాడిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వారు ఘర్షణకు దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన ముందుకు తెచ్చారు. జగన్ వర్గాన్ని విమర్శించిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పై జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే పార్టీ అధిష్ఠాన వర్గం పూనుకుని సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసేదాకా నిరీక్షిస్తారా, ఇంకా జాప్యం చేస్తే మరో మార్గం ఎంచుకుంటారా అనేది తేలడం లేదు. అయితే మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసే లోగా తమ బలాన్ని మరింతగా కూడగట్టుకునే ప్రయత్నాలు జగన్ వర్గం చేయవచ్చునని అంటున్నారు. తనను ముఖ్యమంత్రిని చేయకపోతే పార్టీని చీల్చడమే మార్గమని జగన్ తాను అనుకునే కన్నా ఆయన వర్గం అందుకు ఎక్కువగా ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ వర్గం మాట్లాడే తీరు అదే రీతిలో ఉంది.












Click it and Unblock the Notifications