ఆంధ్రజ్యోతి టార్గెట్ వైయస్ జగన్

YS Jagan
తాజా రాజకీయ పరిణామాలతో ఆంధ్రజ్యోతి దినపత్రిక పండుగ చేసుకుంటోంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమ లావాదేవీలపై వరుస కథనాలను ప్రచురిస్తోంది. గత నాలుగైదు రోజులుగా ఆ వార్తాకథనాలను ప్రచురిస్తోంది. ఇంకా కొనసాగిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావు ఎలా సొమ్మును కూడబెట్టారనేది ఆ వార్తాకథనాల ప్రధాన సారాంశం. 40 లక్షల రూపాయ వార్షికాదాయం గల వైయస్ జగన్ ఆరేళ్ల కాలంలో 40 కోట్ల వార్షికాదాయానికి చేరునే ఎత్తుకు ఎలా ఎదిగాడనే విషయాన్ని ప్రధానం చేసుకుని ఆంధ్రజ్యోతి దినపత్రిక శనివారం వార్తాకథనాన్ని ప్రచురించింది.

ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి వైయస్ అధికారాన్ని వైయస్ జగన్ ఎలా వాడుకున్నారనే విషయంపై సవివరమైన వార్తాకథనం అది. వైయస్ ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావుకు, వైయస్ జగన్ కు మధ్య తగాదా ఎందుకు వచ్చిందనే విషయంపై కూడా ఆ పత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించబోతోంది. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తాకథనాల సారాంశం కూడా అదే అయినప్పటికీ వైయస్ జగన్ పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో పకడ్బందీగా, పథకం ప్రకారం కొత్త విషయాలు చేర్చి ఆంధ్రజ్యోతి ఈ వార్తాకథనాలను ప్రచురిస్తోంది. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు, వైయస్ జగన్ కు చాలా కాలంగా వైరం ఉంది. అవకాశం దొరికితే వైయస్ జగన్ పై విమర్శలకు, ఆరోపణలకు రాధాకృష్ణ తన పత్రికను వేదికగా మారుస్తున్నారనే అభిప్రాయం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+