సి నారాయణరెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రం కోసం...

C Narayana Reddy
ఆయన అత్యంత లౌక్యుడు. అందుకే అన్ని పదవులు ఆయనను వరించాయి. ఇప్పుడు తెలంగాణ మేధావులు ఆయన ఏ వైపు ఉన్నారని ఆలోచిస్తున్నారు. ఆయనే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఎన్నో తెలుగు సినిమాల్లో గొప్ప పాటలు రాసిన మహా కవి ఆయన. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలున్నాయి.

తెలంగాణ విషయంలో ఆయన వైఖరి ఏమిటన్నదే ప్రధానాంశం. ఇప్పటివరకు ఆ విషయంలో గోడ మీద పిల్లి (గోపి) గోపి ఆయన శిష్యుడు కావచ్చు, గోడ మీద పిల్లిలా ఉన్న సినారె స్పష్టంగా ముందుకు రాలేక తప్పని పరిస్ధితి వచ్చింది. "మారు మూల పల్లెలోన మధుర గానముదయించేనని, నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది" అని ఒక మంచి పాట రాసిన గొప్ప కవి ఆయన. ఇప్పుడు ఆ మధుర గానాన్ని తెలంగాణ పల్లెల్లో పంచవలసిన బాధ్యత ఆయనది. ఇప్పుడు పదవులు లేవనో, ఇంకా ఏమీ లేవనో అనుకోకుండా చిత్త శుద్దిగా ఆయన ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంకా, ఈ వయసులోనూ లౌక్యంగా ఉండాల్సిన అవసరం లేదేమో.

ఆయన ఎబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు జాతి మనది అన్న పాట గురుంచి ఇలా చెప్పారు "ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించాక రాసిన పాట అది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమం జోరుగా జరుగుతోంది. ఇక్కడ, అక్కడా భాష తెలుగే. అందుకే తెలుగుజాతి అన్నాను. నా దృష్టిలో తెలంగాణ జాతి, ఆంధ్రా జాతి అని ఉండదు. అధిక సంఖ్యాకులు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో నిరోధించడం భావ్యం కాదన్నది నా అభిప్రాయం."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+