ఓ తెలుగు టీవీ చానెల్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని హంగులూ సమకూరుస్తున్నారు. తమ పార్టీకి ఎల్లవేళలా సపోర్టు పలికేందుకు దాన్ని సిద్దం చేసుకున్నారు. స్టూడియో ఎన్ టీవీ చానెల్ ను ఆయన పార్టీ ప్రచారానికి, తన ప్రచారానికి వాడుకోవడానికి సిద్దమయ్యారు. ఇతర పార్టీల్లోని ప్రత్యర్థుల అవినీతి, అక్రమాలను చెండాడేందుకు కూడా దాన్ని వాడుకునేందుకు సిద్ధపడ్డారు. అందుకు అన్ని ఆ టీవీ చానెల్ కు అన్ని హంగులూ సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టీవీ చానెల్ చంద్రబాబు సమీప బంధువుకు చెందింది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఆ టీవీ చానెల్ తీవ్రంగా ధ్వజమెత్తుతోంది. గత కొంత కాలంగా జగన్ ను టార్గెట్ చేసి ఆయన ఆస్తులపై ఆరా తీస్తూ ప్రచారం చేస్తోంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబ సభ్యులకు, తన అనుచరులకు ఎలా ఆస్తులు సమకూర్చుకునే ఏర్పాట్లు చేసిందనే విషయంపై ఆ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఇంత కాలం ఆ టీవీ చానెల్ ఉందో, లేదో ఎవరికీ తెలియదు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం చేయడంపై అందరి దృష్టీ దానిపై పడింది. వైయస్ జగన్ అనుచరుడు అంబటి రాంబాబు ఆ టీవీ చానెల్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆ టీవీ చానెల్ లో దొంగ పెట్టుబడులు పెట్టారని విరుచుకు పడ్డారు. ఎవరి పాట వారి చానెళ్లు పాడుతాయనే విషయం సాక్షి చానెల్ ను చూస్తే తెలియదా అని వెక్కిరిస్తున్నారు.