రోశయ్య ఏజెంట్ గా గ్రంధి మల్లికార్జున రావు?

జగన్ కుటుంబం ఆగ్రహంగా ఉండడం, ఇక్కడ పెద్దగా కలెక్షన్లు లేకపోవడం వల్ల కెవిపి ఇప్పుడు రోశయ్యకు కొంచెం దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్ధానాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త, జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంధి మల్లికార్జున రావు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెసు హైకమాండ్ కు మధ్య ఆయన అనుసంధాన కర్తగా మారారని సమాచారం. దేశంలోనే కాకుండా ఆసియాలో అనేక అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు కట్టి జిఎంఆర్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నది మోహన్ రావు ఉద్దేశం.
ఇలా ఉండగా అనేక కుంభకోణాలు ఎదుర్కొంటున్న టిటిడి పాలకవర్గం నుంచి చైర్మన్ ఆదికేశవులు నాయుడిని తొలగించి, కొత్త చైర్మన్ గా మల్లికార్జున రావుని నియమించే అవకాశాలున్నాయి. మల్లికార్జున రావు రోశయ్య కులానికి అంటే వైశ్య కులానికి చెందినవారు. అయితే ఆదికేశవులునాయుడికి స్ధానిక ఎమ్మెల్యే అయిన చిరంజీవి మద్దతు ఉంది. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు. ఈమధ్యనే కాంగ్రెసు హైకమాండ్ కు దగ్గరైన చిరంజీవి ఆదికేశవులు టిటిడీ చైర్మన్ గా కొనసాగే విధంగా చూడగలరని మరో అభిప్రాయముంది.












Click it and Unblock the Notifications