నిత్యానందకు పోలీసు దెబ్బలు తప్పవా?

నాలుగు రోజులు విచారించి వివరాలు సేకరించాలని సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. అయితే నిత్యానంద శుక్రవారం గాఢంగా నిద్రపోయాడు. ఆయన్ను నిద్రలేపడానికి సీఐడీ అధికారులు విఫలయత్నం చేశారు. శనివారం సీఐడీ విభాగం డిఐజి డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ అధికారి యంఎన్ రెడ్డితో సహ నలుగురు అధికారులు నిత్యానందను విచారించడానికి సిద్ధమయ్యారు.
పోలీసులను బురిడీ కొట్టించడానికి ఈ రాసలీలల స్వామీజీ అన్ని రకాల యుక్తులను ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. కొంత సమయం స్వామీ వారు నిద్ర పోవడం, ధ్యానం చేయడం తదితర వాటితో అధికారుల సహనాన్ని పరీక్షించాడు. తరువాత భోజనం చేయకుండా మొండికేశాడు. చివరికి తనకు తన ఆశ్రమం నుంచి భోజనం తెప్పించాలని పట్టుబట్టారు. అధికారులు ఆశ్రమం నుంచి భోజనం తెప్పించినా..తినకుండా అలిగాడని తెలిసింది. అనంతరం తనకు పాలు, బాదం, ముంతమామిడి పప్పు (ఈ మూడూ సెక్స్ కోరికలను పెంచేవే కావడం గమనించాల్సిన విషయం) కావాలని గొంతెమ్మ కోర్కెలు కోరాడని ఒక అధికారి వెల్లడించారు.
సోమవారం వరకు నిత్యానందను విచారించడానికి సీఐడీ అధికారులకు అవకాశం వున్నందున అంతవరకు కాలం వెళ్ళదీసి పోలీసుల నుంచి తప్పించుకోవాలని స్వామీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తమిళనాడు పోలీసులు నిత్యానందను అదుపులోకి తీసుకుంటే బెంగళూరు పోలీసులు విచారించడానికి మరింత సమయం పడుతుంది. స్వామి నోరు విప్పకుండా ఇలాగే ప్రవర్తిస్తే సీఐడీ అధికారులు ఇక వారి పద్ధతులలో విచారిస్తారని ఒక అధికారి అన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications