ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ9పై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మండిపడుతున్నారు. టీవీ9 వార్తాకథనాలపై తీరుపై వారు నిప్పులు చెరుగుతున్నారు. సీమాంధ్ర అధ్యాపకులపై దాడి ఘటనపై టీవీ9 తీరును వారు గర్హిస్తున్నారు. తమను తీవ్రవాదుల లాగా ఆ టీవీ చానెల్ చిత్రీకరిస్తోందని వారు విమర్శలు చేస్తున్నారు. ఉస్మానియా విద్యార్థులకు చదువు రాదని, తెలంగాణ అధ్యాపకులకు పేపర్లు దిద్దడం రాదని ఆ టీవీ చానెల్ తప్పుడు ప్రచారం సాగిస్తోందని అంటున్నారు. బిఇడి స్పాట్ వాల్యుయేషన్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధ్యాపకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. తాము అధ్యాపకులపై దాడి చేయలేదని, సీమాంధ్ర అనుకూల మీడియా తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఓయు విద్యార్థుల జెఎసి నాయకులు అంటున్నారు. విద్యార్థులకు ఉస్మానియా విసి తిరుపతిరావు కూడా అండగా నిలిచారు. విద్యార్థులు దాడులు చేస్తే విశ్వవిద్యాలయంలో ఆంధ్రావాళ్లు ఉండగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద, పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఒయు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు.