ముదురుతున్న జగన్, రోశయ్య జగడం

రాజును చూసిన కళ్ళతో మొగుడ్ని చూస్తే మొత్త బుద్ధి అవుతుందట. అలా ఉంది వైయస్ జగన్ అనుచరుల వ్యవహారం. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ జగన్ అనుచరులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాలంటే జగన్ కు సేవ చేసుకోవాలన్న ధోరణిలో వీరు ఉన్నారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను 'పిసినారి" రోశయ్య సరిగా అమలు చేయడం లేదన్న బాధ వారిలో ఉంది. కానీ ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో, రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైన స్ధితిలో రోశయ్య తన పరిధిలో చేయగలిగింది చాలా తక్కువన్న విషయాన్ని గ్రహించాలి. ఏమైనా రోశయ్యకు ముందున్నది ముసళ్ళ పండగేమోననిపిస్తోంది.












Click it and Unblock the Notifications