ఇల్లకగానే పండుగ కాదన్నట్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే కె. రోశయ్యకు మిగిలింది ఏమీ లేదు. కలలో కూడా ఊహించని ముఖ్యమంత్రి పీఠం దక్కిందనే సంతోషమే తప్ప ఆయనకు ఏ విధంగానూ ఆనందించే విధంగా అధికారం సాగడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో ఆయన మాజీ ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర రెడ్డిని, చంద్రబాబును మించిపోయారు. మంచిలో మించితే ఆనందమే కానీ చెడులో మించితే మిగిలేది విషాదమే. రోశయ్య మించింది చెడులోనే. వారిద్దరి పాలనలో కన్నా రోశయ్య పాలనలో ఆత్మహత్యలు ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏడాదికి 11 వేల ఆత్మహత్యలు జరగగా, చంద్రబాబు హయాంలో 9 వేల ఆత్మహత్యలు జరిగాయి. మరి, ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏడాది పాలనలో ఆత్మహత్యల సంఖ్య 15 వేలకు చేరింది. ఆత్మహత్యలు పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇందులో నిరుద్యోగం ఓ ప్రధానమైన కారణమంటున్నారు.