అల్లు అరవింద్ మెగా ఆపరేషన్

Allu Aravind
మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల్లో ఆయన బావ మరిది అల్లు అరవింద్ ప్లానే సక్సెస్ అయింది. క్రమక్రమంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు వైపు నడిపిస్తూ విలీనం ద్వారా ఆయన ఓ పకడ్బందీ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్‌దే కీలక పాత్ర. ఎన్నికల్లో ఓటమికి తీవ్ర విమర్శలను ఎదుర్కున్న అల్లు అరవింద్ కొంత కాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి హాయిగా సినిమా బిజినెస్ చేసుకున్నారు. తిరిగి ప్రజారాజ్యం పార్టీలో అడుగు పెట్టి ఆపరేషన్ పూర్తి చేశారనే మాట వినిపిస్తోంది. అల్లు అరవింద్ చర్యల వల్లనే చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు పార్టీకి దూరమైనట్లు చెబుతారు. పార్టీకి పునాదులు, వేసి సిద్ధాంత భూమికను తయారు చేసిన మిత్ర వంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత, చిరంజీవి సోదరులు పక్కకు తప్పుకున్న తర్వాత అల్లు అరవింద్ తన పని కానిచ్చేశారని అంటారు. ఏమైనా, విజయం అల్లు అరవింద్‌దేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+