క్రైస్తవానికీ వైయస్‌పైనే ఆంధ్రజ్యోతి నిందలు

మైనారిటీల ప్రార్థనాలయాలకు గత ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయించేవారని, అయితే వైయస్ వచ్చాక జిల్లాలవారీగా గ్రామాలను ఎంచుకుని చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పింది. జిల్లాల్లో 226 చర్చిల నిర్మాణానికి, కొన్ని చర్చిల మరమ్మత్తుకు రెండున్నర కోట్ల రూపాయలను అప్పటి వైయస్ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపింది. మొత్తంగా వైయస్ హయాంలో మతమార్పిడులకు ఎక్కడలేని ప్రోత్సాహం లభించిందని చెప్పింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో మత ప్రబోధకుడిగా ఒక వెలుగు వెలిగిన కెఎ పాల్‌ను వెనక్కి నెట్టి వైయస్సార్ అల్లుడు బ్రదర్ అనిల్ హవా చోటు చేసుకుందని కూడా ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications