తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డిని ఏకాకిని చేయడానికి చేసిన ప్రయత్నాలపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నీళ్లు చల్లడంతో శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి అలక వహించినడట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అలిగి ఆయన రాజీమానాస్త్రం ప్రయోగించినట్లు విరివిగా ప్రచారం జరిగింది. నాగంను బుజ్జగించే యత్నాలపై ఆయన సొంత జిల్లా మక్తల్ ఎ మ్మెల్యే కొత్తకోట దయాకరరెడ్డి నిరసించి రాజీనామా అస్త్రం ప్రయోగించారు. 'తెలంగాణలోని పార్టీ ఎమ్మెల్యేలను విలన్లుగా, తానొక్కడే హీరో లా నాగం పార్టీ ప్రతిష్ఠను పణంగా పెట్టారు. నా నియోజకవర్గంతో పాటు సుద్దాల దేవయ్య, మరికొందరి నియోజకవర్గాల్లో పార్టీ నేతలకు ఫోన్లుచేసి మా దిష్టి బొమ్మలు తగలబెట్టాలని ప్రోత్సహించారు.
టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని వారికి చెప్పారు. ఇంత చేశాక ఇంకా బుజ్జగించేదేమిటి? ఆయన మా దిష్టిబొమ్మలు తగలబెట్టిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? నాకు పార్టీ వద్దు. ఎమ్మెల్యే పదవీ వద్దు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేస్తానని ఆయన ఆగ్రహంగా పార్టీ నేతల వద్ద దయాకర్ రెడ్డివ్యాఖ్యానించారు. బాబు వద్దకు రమ్మని మిగిలిన ఎమ్మెల్యేలు కోరినా నిరాకరిస్తూ రాజీనామా లేఖ రాసి స్పీకర్ కు ఇచ్చి సభనుంచి వెళ్లిపోయారు. దాంతో కొత్తకోట దయాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు ఇతర శాసనసభ్యులు రంగంలోకి దిగారు.
TDP Telangana region MLA Kothakota Dayakar Reddy dissatisfied with party president N Chandrababu Naidu for yielding Nagam Janardhan Reddy's pressure.
Story first published: Wednesday, March 9, 2011, 11:38 [IST]