మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజాపై కోర్టు ధిక్కరణ కేసు వేసే ఆలోచనలో మంత్రి శంకరరావు ఉన్నట్లు సమాచారం. వైయస్ జగన్ ఆస్తులపై శంకరరావు రాసిన లేఖను హైకోర్టు సూమోటాగా స్వీకరించడాన్ని తప్పు పడుతూ రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని శంకర రావు భావిస్తున్నారు. దీంతో ఆమెపై కేసు వేసే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రోజాది ఐరన్ లెగ్ అని శంకరరావు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఆమె వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని కూడా ఆయన అన్నారు. జగన్‌పై కారాలు మిరియాలు నూరుతున్న శంకర రావు రోజాపై కూడా గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.