జగన్ కోసమే కోమటిరెడ్డి సోదరుల హెచ్చరికలా?

కానీ వారి అడుగులు మాత్రం జగన్ వైపు ఉన్నందునే మాటిమాటికి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారని కాంగ్రెసు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి సోదరులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ కోసమే వారిపై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని జగన్ కోసమే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ద్రోహులకు చెప్పుల దండలు వేయాల్సి వస్తే ఇప్పటికే నాలుగైదు సార్లు వారికి వేయాల్సి ఉంటుందన్నారు. జగన్ వైపు అడుగులు వేసే వ్యూహంలో భాగంగానే వారు తెలంగాణ బూచిని చూపి పార్టీ నుండి జరగాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ వెంకట్ రెడ్డి మంత్రి పదవికి ఈసారి ఎసరు పడుతుందనే వాదనలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ వైపు అన్న ఆరోపణలును వారు పలుమార్లు ఖండించడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications