జయసుధకు రాజకీయ ఊరట

జయసుధను కార్తిక రెడ్డి లెక్క కూడా చేసినట్లు కనిపించలేదు. జయసుధ పట్టు వీడకుండా కయ్యానికి కాలు దువ్వారు. అప్పట్లో ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారిద్దరి మధ్య పంచాయతీ ఆయన దాకా వెళ్లింది. జయసుధ తన బాధను రోశయ్య వద్ద వెల్లబోసుకున్నారు. సమస్య పరిష్కారమైందో కాలేదో తెలియదు గానీ చాలా కాలంగా ఇరువురి మధ్య గొడవలు వీధికెక్కిన దాఖలాలు లేవు. అయితే డిసెంబర్‌లో కార్తిక రెడ్డి మేయర్ పదవికి కత్తెర పడుతోంది. మేయర్ పదవిని మజ్లీస్‌కు అప్పగించాల్సి వస్తుండడంతో ఆమె దిగిపోక తప్పని పరిస్థితి. ఇది జయసుధకు ఎంతైనా గుండె నిండా ఊపిరి పీల్చుకునే ఊరటే కదా.












Click it and Unblock the Notifications