కార్తిక రెడ్డిపై పగబట్టిన జయసుధ?

తనకు కార్తిక రెడ్డి కనీసం కార్పొరేటర్‌కు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదని జయసుధ ఇప్పటి వరకు తెగ బాధపడిపోతూ వచ్చారు. కార్తిక రెడ్డికి, జయసుధకు మధ్య చెలరేగిన పంచాయతీ అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య దాకా వెళ్లింది. అయినా జయసుధ స్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు జయసుధ పాచికలు వేశారని అంటున్నారు. కార్తిక రెడ్డిని మేయర్ పదవి నుంచి తొలగిస్తే తాను కాంగ్రెసుకు మద్దతిస్తానని జయసుధ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెగేసి చెప్పారట. మజ్లీస్‍ను ఒప్పించి మరో ఏడాది కార్తిక రెడ్డి పదవిని పొడగిద్దామని అనుకున్న ముఖ్యమంత్రి కూడా జయసుధ పట్టుతో మారిపోయారట. ముఖ్యమంత్రికి ఇప్పుడు శాసనసభ్యులు అవసరం ఉంది కాబట్టి జయససుధ షరతుకు అంగీకరించారని అంటున్నారు. ఒప్పందం ప్రకారం మజ్లీస్‌కు మేయరు పదవి ఇచ్చేందుకు కార్తిక రెడ్డిని గద్దె దింపేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు.












Click it and Unblock the Notifications