వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ మంత్రులకు కిరణ్ పాఠాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

kiran kumar reddy
సకల జనుల సమ్మె విరమణతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాస్తా ఊరట లభించింది. దీంతో ఆయన తెలంగాణ మంత్రులతో మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వారికి ఆయన సంక్షేమ పాఠాలు చెప్పారు. సంక్షేమ మాసం ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని వారికి ఆయన హితబోధ చేశారు. సకల జనుల సమ్మె కాలంలో ఆగిపోయిన ప్రయోజనాలను కూడా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు.

రచ్చబండ రెండో విడత కార్యక్రమాన్ని నవంబర్ 2 నుంచి 15వ తేదీ వరకు పది పనిదినాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన తెలంగాణ మంత్రులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తప్ప తమకేమీ వద్దని తెలంగాణ ప్రజలు మొండికేస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రులకు ఎదురయ్యే ఇబ్బందులేమిటో తెలుసు. వాటిని తీర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా, అంటే లేరనే చెప్పాల్సి ఉంటుంది.

English summary
CM Kirankumar Reddy suggested Telangana ministers to see the implementaion of welfare programmes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X