మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. వైయస్ జగన్‌కు దూరమవుతున్నట్లు ఇటీవల ప్రచారం మొదలు కావడంతో ఆమె ఎటు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖను తమ వైపు లాగాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముమ్మరంగానే ప్రయత్నాలు చేసినట్లు అర్థమవుతోంది. ఆమె కొంత మేరకు మెత్తబడినట్లు కూడా తెలుస్తోంది. ఆమె విధేయత మారుస్తున్నట్లు వార్తలు రావడంతోనే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆమె రాసిన బహిరంగ లేఖ బయటకు వచ్చి కలకలం చెలరేగింది. ఆ తర్వాత సురేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఒకేసారి విధేయత మార్చినట్లు కాకుండా క్రమంగా వెనక్కి రావాలనే ఉద్దేశంతోనే సురేఖ ఆ మీడియా సమావేశంలో కాస్తా వెనక్కి తగ్గి కాంగ్రెసుపై విమర్శలు చేశారని అంటున్నారు. కాగా, సురేఖ లేఖలు కృత్రిమమైనవని, వాటిని సురేఖ రాయలేదని పిసిసి అధికార ప్రతినిధి పాలడుగు వెంకటరావు అన్నారు. కొండా సురేఖపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని బలమైన వాదనలు ముందుకు వస్తున్నాయి. ఇదంతా సురేఖను వెనక్కి రప్పించడానికి కాంగ్రెసులో జరుగుతున్న కసరత్తు అని భావిస్తున్నారు. సురేఖ వెనక్కి వస్తే జగన్ వర్గం నైతికంగా కూడా దెబ్బ తింటుందనేది కాంగ్రెసు నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.
Congress leadership is trying vow MLA Konda Surekha. If BC leader like Konda Surekha from Telangana distances from YS Jagan, it will boost up Congress morale, it is said. PCC president D Srinivas is trying convince her to change her layolity towards Congress.