వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దెబ్బ తగిలింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రామంలో వైయస్ జగన్ ఈ నెల 25వ తేదీన తలపెట్టిన ఓదార్పు యాత్ర తమకు వద్దని కోట్ల విజయభాస్కర రెడ్డి గ్రామానికి చెందిన ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామానికి జగన్‌ను రానివ్వవద్దని వారు డిఎస్పీని కోరారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఈ గ్రామస్థులు జగన్ ఓదార్పునకు ఎదురు తిరుగుతున్నారు.
కాగా, అదే సమయంలో జగన్‌కు అదే గ్రామంలో మరో ఎదురు దెబ్బ కూడా తగిలింది. తమకు ఎవరి ఓదార్పు లేదని ఆ గ్రామానికి చెందిన కోయిలకుంట్ల సావిత్రమ్మ అంటోంది. తన భర్త అనారోగ్యంతో మరణించాడని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రెండు రోజులకు గోపాల్ అనే రైతు మరణించాడు. ఈ మరణాన్ని వైయస్ జగన్ వర్గీయులు వైయస్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి జాబితాలో చేర్చారు. అయితే, తన భర్త కేవలం అనారోగ్యం కారణంగానే మరణించాడని సావిత్రమ్మ చెబుతోంది.