వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెవిపిని సోనియా నమ్ముతారా?

అప్పటి సమన్వయ కమిటీలో కెవిపి రామచందర్ రావుతో పాటు ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా ఉన్నారు. కానీ ఆ సమన్వయ కమిటీ పనిచేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మరోసారి సమన్వయ కమిటీని వేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నారు. సోనియా సూచనల మేరకే ఈ సమన్వయ కమిటీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వేయబోయే సమన్వయ కమిటీలో కెవిపికి స్థానం దక్కుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది. పైగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కెవిపి మీద అంత మంచి అభిప్రాయం లేదు.