సిఎం పదవి: కిరణ్‌కు ఆజాద్ ప్రామిస్

ఆ తర్వాత... ఈ అంశం సద్దుమణిగింది. కానీ... శనివారం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో... శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఇందిరమ్మ బాటలో ఉన్న కిరణ్‌ను పలువురు మంత్రులు, ఇతర నాయకులు సంప్రదించారు. కిరణ్ నేరుగా గులాం నబీ ఆజాద్‌కే ఫోన్ చేసి... జాతీయ మీడియాలో వచ్చిన వార్తల గురించి అడిగారు. దీనిపై ఆజాద్ స్పందిస్తూ... అదంతా న్యూసెన్స్ నాన్సెన్స్ అని ఏమీ లేదని, యు గో ఎ హెడ్ అని కిరణ్‌కు బలమైన హామీ ఇచ్చారట.
నిజానికి ముఖ్యమంత్రికి కూడా తన పదవి విషయంలో ఎలాంటి అనుమానం లేదని... కానీ, మిగిలిన నాయకులంతా ఆరా తీస్తుండటం, విషయమేమిటో కనుక్కోవాలని సూచించడంతో ఆజాద్‌తో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెప్పాయి. శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలో విలేకరులు కిరణ్‌ను ప్రశ్నించగా... ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లడం గమనార్హం.












Click it and Unblock the Notifications