వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ న్యూస్ ఛానల్లో వాటా కోసం బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
కాంగ్రెసు పార్టీకి ఓ వార్తా ఛానల్, ఓ వార్తా పత్రిక అవసరమని మంత్రి ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ పార్టీలోని చాలామంది నేతలు దానిని సమర్థించారు. మరికొందరు మాత్రం ఆ అవసరం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసుకు వార్తా ఛానల్, పత్రిక వస్తుందో లేదో తెలియదని కాని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం స్వంతగా ఓ వార్తా ఛానల్‌లో వాటాలు కొననున్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఓ ప్రధాన వార్తా ఛానల్‌లో వాటాలు కొనేందుకు బొత్స ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే బొత్స కుటుంబానికి విజయనగరంలో సత్య కేబుల్ నెట్ వర్క్, హైదరాబాదులో సిటీ విజన్‌లో వాటాలు ఉన్నాయి. వీటిలో ఈయన ప్రధాన భాగస్వామి. తాజాగా తెలుగు న్యూస్ ఛానల్‌లో వాటా కోసం బొత్స తన సోదరుడి ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. బొత్స 2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతున్నారని అంటున్నారు.

టివి ఛానెల్ కొనడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగతంగా తనకూ పార్టీలో పైకెదగేందుకు ఉపయోగపడుతుందని బొత్స భావిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 23 వరకు వార్తా ఛానళ్లు ఉన్నాయి. అందులో ఐదారు ఛానెల్లు టాప్‌లో ఉన్నాయి. దీంతో అతను టాప్ రేటింగ్స్‌లో ఒకటైన ఓ ఛానల్‌లో వాటాలను గానీ లేదా ఆ ఛానల్‌ను గానీ కొనేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

జీ 24 గంటలు యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. కాంగ్రెసు బలోపేతం కోసం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వైయస్ జగన్ ఆధ్వర్యంలో సాక్షితో పాటు సూర్య పత్రికలను తీసుకు వచ్చినప్పటికీ క్రమంగా అవి ఆ పార్టీకి దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు కోసం ఓ ఛానల్, పత్రిక అవసరం అనుకున్న సమయంలో బొత్స కూడా సొంతగా ఓ ఛానల్ కొనాలని భావిస్తుండటం గమనార్హం.

English summary

 It is said that PCC chief and Transport minister Botsa Satyanarayana is planning to buy shares in a TV channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X