వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌వర్గంపై వేటు లేటు: రెండు దఫాలుగా ఉపపోరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంపై వేటు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రెండు దఫాలుగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలపై బడ్జెట్ సమావేశాలలోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అందరూ చివరి నిమిషం వరకు భావించారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎమ్మెల్యేలపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో ఒకేసారి ఉప ఎన్నికలు ఎదుర్కొనలేకనే కాంగ్రెసు పార్టీ జగన్ వర్గంపై వేటును ఆలస్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నికలపై దృష్టి పెడతామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. త్వరలో ఆ రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరులోగా తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల అంశం పూర్తి కానుంది. ఆ తర్వాత మరోసారి జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

English summary
The ruling party was considering the option of splitting the bypolls to its advantage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X