ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 2వ తేదీలోగా ఎప్పుడైనా అరెస్టు కావచ్చునట. అలా అని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అందుకే వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై అనర్హత వేటు వేయలేదని అంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఏప్రిల్ 2వ తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. చార్జిషీట్ దాఖలు చేసేలోగా జగన్ అరెస్టు తప్పదని కాంగ్రెసు నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే జగన్ ఆరెస్టు వల్ల లభించే సానుభూతి పనిచేసి తమకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని కాంగ్రెసు పార్టీ నాయకత్వం భావిస్తోందట. అందుకే వారిపై అనర్హత వేటును ఆపేసినట్లు చెబుతున్నారు. కేసులో జగన్ పాత్ర ఉన్నట్లు తెలే వరకు అరెస్టు చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు.
Congress circles expect the arrest of Jagan Mohan Reddy any time between now and April 2, the last date when the CBI has to file the chargesheet in the illegal assets case.
Story first published: Monday, February 13, 2012, 9:57 [IST]