వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అడ్డుకట్టకు కాంగ్రెస్ కొత్త వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవాను అడ్డుకోవడానికి కాంగ్రెసు పార్టీ కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది. జగన్ వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దీనాదిదీనంగా మారింది. అప్పటి నుండి అతనిని ఎదుర్కోవడానికి ఏదో ఒక వ్యూహంతో ముందుకు వెళుతుంది. జగన్ వైపు రెడ్డి సామాజిక వర్గం వెళ్లకుండా ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. కానీ అది పూర్తిగా విఫలమైంది.

పార్టీలోని పలువురు నేతలను అటు వైపు వెళ్లకుండా పలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కూడా ఫలించలేదు. దాదాపు ఇరవైకి పైగా ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్లిపోయారు. సాధారణ ఎన్నికలు సమీపించే కొద్ది మరికొంతమంది ప్రజాప్రతినిధులు జగన్‌కు జై కొట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సాక్ష్యాత్తూ ఆ పార్టీ నేతలే చెందిన కొందరు నేతలు కిరణ్ కేబినెట్లో జగన్ కోవర్టులు ఉన్నారని చెబుతుండగా.. మరికొందరు ఏకంగా కిరణ్‌నే కోవర్టు అంటూ గందరగోళపరుస్తున్నారు.

ఇదంతా జగన్‌కే లబ్ధి చేకూరుతున్న విషయాన్ని అధిష్టానం గమనించింది. 2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు అత్యంత ముఖ్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెసు ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ఓ వైపు తెలంగాణపై సమాలోచనలు జరుపుతూనే జగన్‌ను ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పార్టీ నుండి వేరు చేయాలనే కొందరి సూచనల వల్ల పార్టీకి మరింత నష్టం జరుగుతుందని గమనించిన అధిష్టానం వైయస్‌ను తమ వాడిగా గట్టిగా ప్రజల ముందుకు తీసుకు వెళ్లే చర్యలు ఆరంభించింది.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో నాడు సన్నిహితంగా నేతలను ఒక్కతాటి పైకి తీసుకు వచ్చి జగన్ పైకి ఎక్కు పెడుతోందంటున్నారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఇటీవల ఆవిష్కరించన డైరీకి అనుమతించిందని చెబుతున్నారు. సోనియా ఆశీస్సులతోనే ఈ డైరీ ఆవిష్కరణ జరిగిందని అంటున్నారు. నాడు వైయస్‌కు అత్యంత ఆప్తులుగా మెలిగిన కెవిపి, మంత్రి రఘువీరా రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి పలువురు నేతలకు పార్టీలో ప్రాధాన్యత, 'ముఖ్య'మైన పదవులు ఇచ్చి జగన్‌ను దెబ్బ తీయాలని చూస్తోందని అంటున్నారు.

English summary
Congress party High Command is chalked out new strategy to face YSR Congress party cheif YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X