వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిఫ్ట్‌లో చిక్కుకున్న సిబిఐ జెడి, సరదా వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

JD Laxmi Narayana
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసు తదితర కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సోమవారం లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. కోర్టు సిబ్బంది తక్షణమే స్పందించడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. సోమవారం నాంపల్లి కోర్టులో వైయస్ జగన్‌ను హాజరుపర్చిన విషయం తెలిసిందే.

కోర్టు భోజన విరామ సమయంలో లక్ష్మీ నారాయణ, ఇతర అధికారులు, న్యాయవాదులు మూడో అంతస్తులోని కోర్టు హాల్ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో వస్తుండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లక్ష్మీ నారాయణతో పాటు పదకొండు మంది లిఫ్ట్‌లో ఉన్నారు. న్యాయవాదుల కోసం ఉన్న ఈ లిఫ్ట్‌లో పరిమితికి మించి ఎక్కడం వల్లనే బరువుతో ఆగిపోయింది.

లిఫ్ట్‌లో ఉన్న వారు అత్యవసర మీట(ఎమర్జెన్సీ బటన్) నొక్కడంతో కోర్టు సిబ్బంది వెంటనే స్పందించింది. కీతో దాని తలుపులు తెరిచారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు మూడు అడుగుల ఎత్తులో ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఉన్న వారి కాళ్లు మాత్రమే బయటకు కనిపించాయి. కోర్టు సిబ్బంది లిఫ్ట్‌కు సమాంతరంగా కుర్చీని ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని దించారు.

ఐదుగురి తర్వాత లక్ష్మీ నారాయణ దిగారు. బరువు వల్ల లిఫ్ట్ బెల్ట్ తెగిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కాగా లిఫ్ట్ నుండి బయటపడిన తర్వాత లక్ష్మీ నారాయణ సరదాగా... ఇలాంటివి అప్పుడప్పుడు అనుభవించాలంటూ నవ్వుతూ వ్యాఖ్యానించి, లంచ్‌కు వెళ్లారు.

English summary
Central Bureau of Investigation(CBI) joint director Laxmi Narayana faced trouble with lift at Nampally special court on Monday, when YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy before court. Eleven VIPs face trouble with lift along with Laxmi Narayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X