జగన్‌తో అంటున్న కిరణ్: టిఆర్ఎస్‌లో కలవరం

ఆయన తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయాన్ని పదే పదే తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. వైయస్‌కు బద్ధ శత్రువు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో, మతతత్వ బిజెపితో జగన్ కుమ్మక్కయ్యారని విమర్శిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కోరుకుంటున్నామని చెప్పే తెలంగాణ రాష్ట్ర సమితితోనూ జగన్ కుమ్మక్కు అయ్యారని మండిపడుతున్నారు. కిరణ్ వ్యాఖ్యల పట్ల తెరాసలో ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు.
ఇప్పటికే గత కొద్దికాలంగా కెసిఆర్, జగన్ కుమ్మక్కయ్యారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే కొనసాగింపుగా ఉంటే తెలంగాణలో తమ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని తెరాస భావిస్తోందట. అందుకే జగన్ అవినీతి, అక్రమాలపై ఇన్నాళ్లూ నోరు మెదపని తెరాస నేతలు ఒక్కసారిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నట్లు, ఆయనకు కౌంటర్ ఇస్తున్నట్లుగా జగన్ అక్రమాలపై ఇప్పుడు మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ తెరాసతో కుమ్మక్కయ్యారనే ఘాటు వ్యాఖ్యలు కిరణ్ చేయగానే తెరాస ఉలిక్కి పడిందంటున్నారు. అందుకే, తెరాస నేతలు కిరణ్ వ్యాఖ్యలను ఖండించటంతో పాటు.. జగన్‌ను అరెస్టు చేయాలని, జగన్ అవినీతిపరుడు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అకస్మాత్తుగా వారు జగన్ పైన విమర్శలు చేయడం కిరణ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే అంటున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించిన జగన్‌తో తాము కుమ్మక్కయ్యామనే ప్రచారం జరిగితే తెలంగాణ ప్రజలు తమ చిత్తశుద్ధిని శంకిస్తారనే ఆందోళన తెరాసలో ఉందని అంటున్నారు.
గత ఉప ఎన్నికలలో జగన్ తన అభ్యర్థులను తెరాసకు మద్దతిచ్చేందుకే నిలబెట్టలేదని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. తాజాగా పరకాలలో, తెరాస తమ అభ్యర్థిని నిలబెడుతోంది జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖను గెలిపించేందుకే అని బిజెపి, టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగింది.
ఇలా తమ పార్టీ జగన్‌తో అంటకాగుతోందనే ప్రచారం తెరాసకు మింగుడు పడటం లేదని అంటున్నారు. పచ్చి సమైక్యవాదిగా ముద్ర పడ్డ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడే కాకుండా, పార్లమెంటులో సమైక్య ప్లకార్డు పట్టుకోవడం, తెలంగాణపై ఇప్పటి వరకు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించని జగన్‌తో తమకు సంబంధాలు అనే అంశాన్ని తెరాస తీవ్రంగా పరిగణిస్తోందని అంటున్నారు. అలాంటి విమర్శలను తిప్పి కొట్టేందుకే ఇప్పటికిప్పుడు తెరాస నేతలు జగన్ అరెస్టు, అవినీతి అంటూ మాట్లాడుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications