జగన్ పార్టీలోకి మాజీ మంత్రి మోపిదేవి?

మోపిదేవి వెంకటరమణను మాచర్ల నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం కలిశారు. తమవి సమీప నియోజకవర్గాలని, ఇద్దరం మిత్రులమని, అందుకే మోపిదేవిని కలిశానని రామకృష్ణారెడ్డి మీడియాతో చెప్పారు. ఇందులో రాజకీయాలు లేవన్నారు. అయితే, మోపిదేవిని రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
ధర్మాన కేసు వేరు మోపిదేవి కేసు వేరు అంటూ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల మోపిదేవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంచల్‌గూడ జైలులో మోపిదేవిని కలిసి మంతనాలు జరపటం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో మోపిదేవిని రేపల్లె నుంచే పోటీలోకి దించే యోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనను ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో అన్నారు. అయితే, దాని నుంచి ఆయన బయటపడ్డారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications