నిమ్మగడ్డ వాన్‌పిక్‌లో నాగార్జున పెట్టుబడులు?

ఆ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం - మాట్రిక్స్ 2010 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ ఎజిఎం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ వార్షిక ఆదాయవ్యయాలను రిజిస్ట్రార్ కంపెనీలకు సమర్పించంది. ఇందులో అక్కినేని నాగార్జున పేరు ఉంది. ఇందులో నాగార్జున పది రూపాయల ముఖ విలువ కలిగిన 2 లక్షల వాటాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరీనాథ్‌కు కూడా ఇందులో పది లక్షల వాటాలున్నాయి.
నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన తర్వాత తన వాటాలను వెనక్కి తీసుకోవడానికి నాగార్జున ప్రయత్నించినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది. ఇందులో 30 శాతం వాటాను సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది.
చాముండేశ్వరినాథ్ వాన్‌పిక్‌లోని తన 30 లక్షల వాటాల్లో 20 లక్షల వాటాలను నిమ్మగడ్డ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు, సినీ హీరో ఎన్ కళ్యాణ్‌రామ్‌కు మాట్రిక్స్ ఎన్‌పోర్టులో 2 లక్షల వాటాలుండేవట. ఆయన వాటిని 2010లో విక్రయించినట్లు ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications