వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పైరసీతోనే రామ్ గోపాల్ వర్మ పైకొచ్చాడట

ఆర్థికంగా వెసులుబాటు లభించడం వల్లనే సంపాదన సంగతి పక్కనపెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి పైకి రాగలిగానని తన ట్విట్టర్ ఖాతాలో వివరంగా రాశారు. తానూ ఒకప్పుడు 'పైరేట్' కాబట్టి తన సానుభూతి వారికి ఉంటుందన్నారు. ఇలాగే మరో ఇంటర్వ్యూలో.. ట్విట్టర్‌తో ఎక్కువసేపు గడపడం అంత మంచిది కాదని సాక్షాత్తూ ఆ సైట్ సహవ్యవస్థాపకుడే హెచ్చరించారు కదా అని ప్రశ్నిస్తే.. ట్వీటింగ్ కూడా సృష్టికార్యం అంత మంచిదని సెలవిచ్చారు. సాధారణంగా జనం తమ ఆరోగ్యానికి ఏది మంచిది కాదో దాన్నే కోరుకుంటారని సూత్రీకరించారు.