గాలి బెయిల్ నిందితుల వసతులకోసం రూ.కోటీ డీల్?

Gali Somasekhar Reddy - Suresh Babu
ర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న గాలి సోమశేఖర రెడ్డి, కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబుల నుండి జైలు అధికారులు లక్షలాది రూపాయలు అందుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. జైలులో ప్రత్యేక ములాఖత్‌లు, వసతుల కల్పన కోసం వారి నుండి అధికారులు డబ్బులు తీసుకుంటున్నారట! నోట్లకట్టలు, సెల్‌ఫోన్లు, ఇతర నిషేధిత వస్తువులు రాచమార్గంలోనే వారికి అందించడానికి అధికారులు కర్త, కర్మ, క్రియలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోమశేఖర రెడ్డి, సురేష్‌బాబు, దశరథరామి రెడ్డి తదితరులకు భోజనం, ప్రత్యేక వసతుల కోసం జైలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇద్దరు ఉప పర్యవేక్షాణాధికారులు, గేటు ఇన్‌చార్జితో కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా సోమశేఖర రెడ్డి మధ్యవర్తులుగా ఉన్న జైలర్‌కు, ఉప పర్యవేక్షాణాధికారికి 25లక్షల రూపాయలు ముట్టచెప్పారట! మానస సరోవర్ బ్యారక్‌లో కొద్దిరోజుల క్రితం పర్యవేక్షణాధికారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో సోమశేఖర్‌ రెడ్డి నుంచి 15వేల రూపాయలు స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే.

అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో తమపై కేసులు పెట్టారని, డబ్బులు దొరక్కపోయినా స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారని సూపరింటెండెంట్‌తో సోమశేఖర్‌ రెడ్డి, సురేష్‌ బాబు వాగ్వివాదానికి దిగారని తెలుస్తోంది. సోమశేఖర్‌ రెడ్డి తదితరులు బెయిల్ కోసం తమ అనుచరులతో అధికారుల చాంబర్లలోనే చర్చలు జరుపుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

విఐపి ఖైదీల ములాఖత్‌ల ముసుగులో అధికారులు లక్షలాది రూపాయలను తమ జేబుల్లో వేసుకుంటున్నారని జైళ్ల శాఖ ఐజికి పలు ఫిర్యాదులు అందుతున్నాయట! గాలి బెయిల్ డీల్ కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు ప్రయత్నించడంతో ఇప్పుడు అదే కేసు నిందితుల కోసం జైలు అధికారులు ఏమైనా చేస్తున్నారా అని ఎసిబి నిఘా పెట్టిందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+