కాళేశ్వర్ బాబా బీమా రూ. కోట్లు, మృతిపై డౌట్స్?

Kaleshwar Baba
కాళేశ్వర్ బాబా మృతిపై అనుమానపు మేఘాలు ముసురుకుంటున్నాయి. కాళేశ్వర్ జీవిత బీమా విలువ దాదాపు రూ.50 కోట్లు కావడమే అందుకు కారణం కావచ్చు. కడపలో రెండు మూడు ప్రైవేటు సంస్థల్లో పాలసీలు తీసుకున్న ఆయన దా దాపు రూ.5-6 కోట్ల ప్రీమియం ఇప్పటివరకు చెల్లించినట్లు తెలుస్తోంది. తన పేరిట రూ.3 కోట్ల బీమా చేయించుకోడానికి పెనుకొండ లో ప్రయత్నించగా, భారతీయ జీవిత బీమా సంస్థ అందుకు అంగీకరించలేదని వార్తాకథనాలు వచ్చాయి. దాంతో ఆయన సొంత జిల్లా కడపలో ప్ర యత్నించారు. అక్కడా నిబంధనలు అడ్డు రావడంతో ప్రైవేటు బీమా సంస్థల్లో రూ. 50 కోట్ల మేర పాలసీలు తీసుకున్నారు.

ఇటీవలి కాలంలో కుటుంబసభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆరోపణలొచ్చాయి. పలుమార్లు కాళేశ్వర్ కోట ప్రాంతంలో ఉండే ఆలయం వద్ద ఒంటరిగా కూర్చొని ఏడ్చేవారని స్థానికులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఓ భయంకర వ్యాధి ఉందని, కాళేశ్వర్ భా ర్య తరఫు బంధువులకు, తల్లిదండ్రుల వైపు వారికి మధ్య సత్సంబంధాలు లేకపోవడం కూడా ఆయన బాధకు కారణమనే ప్రచారముంది. కాళేశ్వర్ మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడ్డారని, పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం తెల్లవారుజామున బెంగళూరుకు తరలించారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+