జైలులో తోటి ఖైదీలతో శ్రీలక్ష్మి ముచ్చట్లు

Srilaxmi
తొలి మూడు రోజులు ముభావంగా, విచార వదనంతో కనిపించిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి చంచల్‌గుడా జైలులో తోటి ఖైదీలతో ముచ్చట్లు పెడుతున్నారు. మీరేం నేరం చేసి జైలుకు వచ్చారంటూ తోటి ఖైదీలను అడుగుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి క్రమక్రమంగా జైలు వా తావరణానికి అలవాటు పడుతున్నట్టు తెలుస్తోంది. అధికారదర్పంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన శ్రీలక్ష్మి ఓఎంసీ అక్రమ గనుల కేసులో అరెస్టయి ఇప్పుడు ఖైదీల మధ్య సాధారణ జీవనం గడపాల్సి వస్తోంది.

ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం పప్పు, చారుతో భోజనం, సాయంత్రం కూరగాయల భోజనం తీసుకుంటున్నారు. ఆమె ఉంటు న్న తొమ్మిదో నంబరు బ్యారక్‌లో మరో పది మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. అందులో ఎక్కువ శాతం వరకట్నం కేసులో నిందితులే. శ్రీలక్ష్మి జైలుకు వచ్చినప్పటి నుంచి ములాఖత్‌కు అడ్వకేట్ మినహా కుటుంబసభ్యులెవరూ రాకపోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+