హనీఫ్‌ను బెదిరించిన తారా చౌదరి?

కస్టడీ ముగిసిపోవడంతో పోలీసులు తారా చౌదరిని, హనీఫ్‌లను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. తారా చౌదరి, ప్రసాద్‌లను నాలుగు రోజుల పాటు పోలీసులు విచారించి ఎన్నో కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కస్టడీ ముగియడంతో తారా చౌదరి రిమాండును న్యాయస్థానం పొడిగించింది. ఆమెతో పాటు దుర్గా ప్రసాద్, ఆ తర్వాత అరెస్టు చేసిన హనీఫ్‌లకు కూడా కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆమె రిమాండును ఈ నెల 25 వరకు పొడిగించింది.
ప్రముఖుల రాసలీలలను రహస్య కెమెరా ద్వారా రికార్డు చేసి వాటిని సిడిలుగా మార్చడంలో హనీఫ్ తారా చౌదరికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. హనీఫ్ ఈ విషయాలను పోలీసులకు వెల్లడించాడు కూడా. తారా చౌదరి తనను బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే ఆ పని చేయాల్సి వచ్చిందని అతను పోలీసులకు చెప్పాడు.
తనపై ఉన్నవీ లేనివీ కల్పించి హనీఫ్ పోలీసులకు చెప్పాడని తారా చౌదరి మండిపడుతోందట. హనీఫ్ కారణంగానే తాను చిక్కుల్లో పడినట్లు కూడా ఆమె అనుకుంటోందంటూ ప్రచారం సాగుతోంది. వ్యభిచార ముఠాలోని పొరపొచ్చాల వల్లనే తారా చౌదరి పట్టుబడినట్లు కూడా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications