గాలి భార్యకు వైయస్ జగన్ 'ఓదార్పు'

YS Jagan
ర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వస్తుందని ఆయన భార్య లక్ష్మీ అరుణకు ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధైర్యం చెప్పారట. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇటీవల జగన్ పర్యటించారు. అప్పట్లో ఆయన తమ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా గాలి జనార్దన రెడ్డి భార్య లక్ష్మీ అరుణ జగన్‌ను కలిసి మాట్లాడినట్లు సమాచారం.

మరో వైపు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ వ్యవహారం తిరగబడడంతో ఆయన గ్యాంగ్ సిబిఐ దాటికి ఊరు వదలి పరారైంది. బళ్లారి శానససభ్యుడు గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబు, కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర అరెస్టు భయంతో వనవాసం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిలు మంజూరుకు రూ.10 కోట్లను గాలి భార్య లక్ష్మీ అరుణ సర్దినట్లు సిబిఐ అనుమానిస్తోందట. ఆమెను కూడా సిబిఐ ఏ క్షణమైనా విచారణకు పిలిచి, అరెస్టు చేయవచ్చునంటున్నారు.

గాలి ముఠాకు సంబంధించిన బెయిల్ ఫర్ సేల్ కుంభకోణంలో సోమవారం నుంచి అరెస్టులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సస్పెన్షన్‌లో ఉన్న సిబిఐ కోర్టు జడ్జి పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్రతోపాటు తొలి విడతలో మాజీ న్యాయమూర్తి చలపతిరావు, ఆయన సోదరుడు బాలాజీ, రౌడీ షీటర్ యాదగిరిలను సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కుంభకోణంలో చేతులు మారిన డబ్బు బెంగళూరు నుంచే వెళ్లిందని విశ్వసిస్తున్న సిబిఐ అధికారుల బృందం విచారణను మరింత తీవ్రం చేసింది.

బెయిల్ ఫర్ సేల్ కుంభకోణంలో కర్ణాటక మంత్రి ఒకరికి పాత్ర ఉందని, లేకపోతే ఇంత పెద్ద మొత్తం చేతులు మారడం సాధ్యమే కాదని సిబిఐ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో గాలికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన ఒకరిద్దరు మంత్రులపై కన్నేసినట్లు చెబుతున్నారు. దర్యాప్తులో పురోగతిని సాధించామని, మరింత లోతుకు వెళితే సంచలనాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+