బయటకు ఎప్పుడొస్తానో తెలియదన్న జగన్

దీన్ని బట్టి జైలులో ఉంటూనే జగన్ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడుతున్నట్లు అర్థమవుతోంది. ప్రజా సమస్యల్ని గుర్తించి పరిష్కారానికి రాష్టవ్య్రాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనా కార్యక్రమాలను నిర్ణయించాలని తెలిపారు. ఆ కారణంగానేవైయస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించారు. రైతు సమస్యలపై ఈనెల 25న రాష్టవ్య్రాప్తంగా నియోజక వర్గాల వారీ ధర్నాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారని చెబుతున్నారు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కవడం వల్లే మూడుస్థానాల్లో ఓటమి చెందినట్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశంలో అభిప్రాయ పడ్డారు. సమావేశం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తోపుదుర్తి కవిత, జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఈనెల 25న తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని రైతులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల సాధనకు పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్టప్రతి ఎన్నికల గురించి సమావేశంలో చర్చించామని, ఈ విషయంలో నాయకత్వ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications