హంగామా: చిరంజీవికి ఆజాద్ హెచ్చరిక?

చిరంజీవి కార్యకలాపాలపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆజాద్ ఆ హెచ్చరిక చేసినట్లు సమాచారం. పర్యాటకమంత్రిగా ఉన్న చిరంజీవి పర్యటనలకు, కార్యక్రమాలకు మంచి నీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఓ వర్గం గుర్రుగా ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ విదేశాలకు ఫ్యామిలీతో వెళ్లడాన్ని చూపుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది ఆయన పర్యాటక వివరాలు, ఖర్చులు విషయంలో ప్రజల సొమ్ముతో చిరంజీవి వినోదిస్తున్నారని ప్రస్తుతం తానా సభలో బిజీగా ఉన్న చిరంజీవికి కేంద్రం నుంచి కొన్ని సూచనలు వెళ్లినట్లు విశ్వసనీయ సమచారం. ప్రతి సమావేశంలోనూ ఆచితూచి మాట్లాడాలని చిరంజీవికి ఆజాద్ నుంచి సందేశం వెళ్లినట్లు వినికిడి.
కళంకిత మంత్రులకు ఇద్దరికి ఉద్వాసన పలికిన నేపథ్యంలో చిరంజీవి కూడా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ముందుకు వస్తున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువగా మాట్లాడవద్దని ఆజాద్ చిరంజీవికి సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications