కూతురి పెళ్లికి లక్ష్మిపార్వతిని పిలువని బాలయ్య
హైదరాబాద్: తన తండ్రి ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతిని నందమూరి హీరో బాలకృష్ణ తన కూతురు తేజస్విని పెళ్లికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. బాలయ్య రెండో కూతురు తేజస్విని వివాహం బుధవారం ఉదయం కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు మనవడు శ్రీభరత్‌తో జరిగిన విషయం తెలిసింది.
లక్ష్మీపార్వతికి బాలయ్య వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక పంపించలేదని అంటున్నారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే, 2010లో మీడియా ఎదుటే బాలయ్య లక్ష్మీపార్వతిని కలిశారు. మీరెందుకు వచ్చారని మీడియా అడిగితే - ఎందుకు రాకూడదు, ఇది తల్లీకొడుకుల మధ్య భేటీ, తాము వివిధ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకుంటామని అప్పట్లో బాలయ్య అన్నారు.

లక్ష్మీపార్వతి తన తల్లి అని బహిరంగంగా అంగీకరించిన బాలయ్య తన కూతురు పెళ్లికి మాత్రం లక్ష్మీపార్వతిని ఆహ్వానించలేదని సమాచారం. బాలయ్య పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తన తనయుడు, బాలయ్య పెద్దల్లుడు నారా లోకేష్ పెళ్లి వేడుకలో హడావిడి చేస్తూ కనిపించారు.
పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications