షర్మిలతో పెళ్లి: అనిల్ బైబిల్‌ను ధిక్కరించాడా?

రక్షణ టీవి, మణికొండ చర్చి స్థలాలను తెలంగాణకు చెందిన పేద క్రైస్తవులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాస్తులు, హెలికాఫ్టర్ కుంభకోణం, బయ్యారం, మణికొండలో దళితులు, బీసీల భూముల కబ్జా, క్రైస్తవ ఛానల్ రక్షణ టీవిని అవినీతి డబ్బుతో నడిపిస్తున్నారని తెలిసి క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
క్రైస్తవ ప్రచారం చేస్తున్న అనిల్ స్వయంగా బైబిల్‌ను ధిక్కరించాడని, బైబిల్ వాక్యం ప్రకారం ఏ వ్యక్తి భార్య బతికి ఉండగా రెండో పెళ్లి చేసుకోకూడదని, అనిల్ రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. కొందరు అగ్రవర్ణాలకు చెందిన బ్రదర్ సతీష్‌కుమార్, సామ్యేల్ పట్టా, స్టీఫెన్ ఫాల్ ( వైజాగ్) ఫాస్టర్ ధామస్ (రాజమండ్రి), ప్రవీణ్‌కుమార్, పాల్‌దినకరన్ (చెనై్న)లతో పాటు మరికొంత మంది బడా ఫాస్టర్లు హంగు ఆర్భాటాల వెనుక అనిల్ ఉన్నారని ఆరోపించారు.
షర్మిల పాదయాత్ర చేస్తూ జైలులో ఉన్న తన సోదరుడు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఉవ్విళ్లూరుతున్న తరుణంలో అనిల్ కుమార్‌పై అన్ని వైపుల నుంచీ దాడి ఉధృతమవుతోంది. అనిల్ కుమార్, షర్మిల దంపతులపై ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications