కిరణ్ రెడ్డితో దామోదర గుసగుసలు: అందుకేనా?

దామోదర రాజనర్సింహ మనసు మార్చుకోవడం వెనక ఆంతర్యం ఏమిటనేది తేలిపోయిందని కూడా అంటున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దామోదర పాత మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో చేయి వేసి నడవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. దీనికంతటకీ, కాంగ్రెసు అధిష్టానం ఇచ్చిన హామీనే అని అంటున్నారు. హోంశాఖను దామోదర రాజనర్సింహకు కట్టబెట్టడానికి కాంగ్రెసు అధిష్టానం అంగీకరించిందని చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో హోంశాఖ కోసం మంత్రులు పోటీ పడడం ప్రారంభించారు. అయితే, ఉప ముఖ్యమంత్రికి హోంశాఖను అప్పగించడం ఆనవాయితీ అని, అందువల్ల ఆ శాఖ తనకు కావాలని దామోదర పట్టుబడుతున్నారట. దానిపైనే అధిష్టానం పెద్దల వద్ద తన వాదనను వినిపించారని అంటున్నారు.
తాను హోంశాఖ కోసం లాబీయింగ్ చేయలేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పినప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. ఆయనకు హోం శాఖ మీద విపరీతమైన మోజు ఉందనేది అందరికీ తెలిసిన విషయమే..












Click it and Unblock the Notifications