సిఎం పదవి: కెసిఆర్‌తో వివేక్ 100 కోట్ల డీల్?

కెసిఆర్ దృష్టిలో దళితులంటే దళిత దొరలని, ఉద్యమం ముసుగులో వారికి సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ నగారా నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డిని ఓడించడానికి మత కల్లోలాలు సృష్టించే కుట్రను నాగర్ కర్నూలు ఎన్నికల్లో పన్నారని ఆరోపించారు. ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖను విడుదల చేశారు. తన లేఖకు కెసిఆరే నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చోటా నేతలతో సమాధానం చెప్పించే వెకిలి వేషాలు వేస్తే దండోరా వేయించి యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ ఎంపి వివేక్‌తో కేసీఆర్ వంద కోట్ల ఒప్పందం చేసుకున్నారు. వంద అసెంబ్లీ, పదిహేను ఎంపి సీట్లు గెలిస్తే తెలంగాణ ఎలా వస్తుందని, ఒకవేళ గెలవలేకపోతే ఉద్యమాన్ని ఏమి చేస్తారని కెసిఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ప్రకటించిన కెసిఆర్‌కు రాబోయే రోజుల్లో అదే గతి పడుతుందని హెచ్చరించారు.
మరోవైపు చింతా స్వామి అనే వ్యక్తికి తమ పార్టీలో ఎటువంటి పదవీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. తనకు తాను ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శినని ప్రకటించుకొని పార్టీపై అవాకులూ చవాకులు పేలుతున్నారని పేర్కొంది.












Click it and Unblock the Notifications