మళ్లీ కీలకం: సోనియా దూతగా డిఎస్?

రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్న మంత్రులను, ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో డిఎస్ మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ డిఎస్‌తో నేరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో డిఎస్ రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్సకు 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. 15 మంది అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు ఇచ్చారు. వారందరితోనూ గురువారం రాత్రినుండి డిఎస్ ఫోన్‌లో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో అంతా మంచే జరుగుతుందని, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంయమనంతో వ్యవహరించాలని డిఎస్ సూచించారు.
సీమాంధ్రుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా తనదే పూచీ అంటూ హామీ ఇస్తున్నారట. పార్టీ ప్రయోజనాలను కూడా విస్మరించ రాదని, పరిస్థితిని అర్దం చేసుకుని సహకరించాలని కోరారు. అయితే రాజీనామాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రుల నుంచి డిఎస్‌కు అంత సానుకూలత వ్యక్తం కావడం లేదని సమాచారం.












Click it and Unblock the Notifications