చిరంజీవికి గంటా టోకరా, కిరణ్ రెడ్డికి బాసట?

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలనే చిరంజీవి వ్యూహానికి అనుగుణంగా సి. రామచంద్రయ్య వ్యవహరిస్తుంటే, అందుకు భిన్నమైన వైఖరిని గంటా శ్రీనివాస రావు అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారంటూ రామచంద్రయ్య ఊదరగొట్టడంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి పనితీరును తప్పు పట్టే పనిని భుజాన వేసుకున్నారు.
సి. రామచంద్రయ్య వ్యాఖ్యలతో గంటా శ్రీనివాస రావు విభేదిస్తున్నారు. చిరంజీవికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశమే లేదని ఆయన చెప్పారు. చిరంజీవితో పాటు కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన చాలా మంది ఇప్పుడు ఆయనతో కనిపించడం లేదు. వారంతా కిరణ్ కుమార్ రెడ్డికి విధేయులుగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు.
మంత్రి సి. రామచంద్రయ్య వంటి ఇద్దరు ముగ్గురు నాయకులు తప్ప, మిగిలిన వారంతా ముఖ్యమంత్రి వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చుట్టూ తిరగడంపై చిరంజీవి కూడా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు కిరణ్ కుమార్ రెడ్డిపై చిరంజీవి అసంతృప్తికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. అందుకే, తాను తెర వెనక ఉండి రామచంద్రయ్యతో చిరంజీవి మాట్లాడిస్తున్నారని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications