తెగతెంపులేనా?: హరి ఇలా.. జూ.ఎన్టీఆర్ అలా..

Harikrishna and Jr NTR
హీరో జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణలు ఆ పార్టీకి దూరమైనట్లుగానే చెప్పవచ్చు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సభకు జూనియర్ లేదా హరికృష్ణ వస్తారా? అని అందరు ఆసక్తిగా చూశారు. ఇటీవల కుటుంబ విభేదాల ప్రచారం నేపథ్యంలో వారు వస్తేనే విభేదాల ప్రచారానికి తెర పడుతుందని అందరు భావించారు.

కానీ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలలో ఎవరు రాకపోవడంతో విభేదాలు వచ్చాయని, ఇది దాదాపు తెగతెంపుల వరకు వెళ్లినట్లేనని భావిస్తున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభం సమయంలో హరికృష్ణ అన్నీ తానై చేశారు. ముగింపుకు మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. బహిరంగ సభకు హాజరవుతారా? అని విలేకరులు ఢిల్లీలో ఉన్న హరికృష్ణను ప్రశ్నిస్తే చూద్దామని, ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. సభ జరిగే సమాయానికి ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటమే కాకుండా ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఛానల్లో బాబు ముగింపు సభకు బాలకృష్ణ, తారకరత్న తప్ప మిగతా నందమూరి కుటుంబ సభ్యులు అంతా దూరంగా ఉన్నారని స్క్రోలింగ్ వచ్చింది. తద్వారా బాబుకు నందమూరి కుటుంబం అండ లేదని చెప్పే ప్రయత్నమే కనిపిస్తోందని అంటున్నారు. హరికృష్ణ, జూనియర్‌లు బాబుతో తెగతెంపులకే సిద్ధమయ్యారని అంటున్నారు. గతంలో బాబును కలిసిన హరికృష్ణ మరో తనయుడు కల్యాణ్ రామ్ కూడా సభలో పాల్గొనలేదు. అయితే, అందుకు ఇతర కారణాలే తప్ప అసంతృప్తి కారణం కాదంటున్నారు.

ఇక, విశాఖపట్నానికే చెందిన సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్ర రావు, తెలంగాణలో సీనియర్ నేత కడియం శ్రీహరి విశాఖ సభకు దూరంగా ఉన్నారు. కడియం శ్రీహరి పార్టీ అధిష్ఠానంపై అలకబూనారు. తన సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కార్యకర్తలను విశాఖకు పంపిన ఆయన స్వయంగా వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో, ఆయన పార్టీని వీడనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై కడియంను వివరణ కోరగా, ఇటీవల జరిగిన పరిణామాలపై మనస్తాపంతోనే సభకు వెళ్లలేదని, అంతమాత్రాన పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+