కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇమేజ్ డామేజ్: 12శాతం పడిపోయిందా!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ క్రమంగా తగ్గిపోతోందా? ఆయనకు ప్రజల్లో గతంలో ఉన్నంత క్రేజ్ లేదా? జగన్‌కు, ఆయన పార్టీకి ప్రజల్లో ఆకర్షణ తగ్గిందా? అంటే అవుననే అంటున్నారు. జగన్‌కు ప్రజాకర్షణ తగ్గిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చెప్పారు. ఆయన జగన్ సొంత జిల్లాలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు ప్రజాకర్షణ తగ్గిందని, గతంలో ఆయన పార్టీకి వచ్చిన ఓట్లలో 12 శాతం తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా సన్నగిల్లాయని చెప్పారు. అదే సమయంలో ప్రజలలో కూడా ఆయన పట్ల సానుభూతి, ఆకర్షణ తగ్గిందని కార్యకర్తలకు చెప్పారు.

అదే సమయంలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యానే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి ఇప్పటికే ఓ అభ్యర్థి ఉండగా... ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ను పార్టీలోకి తీసుకోవడం, ఆయనకు హామీ ఇవ్వడం మూడు రోజుల క్రితం కలకలం రేపిన విషయం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఇలా అయితే తమ పార్టీ పిఆర్పీలాగా అవడం ఖాయమనే ఆందోళన వెలిబుచ్చారు కూడా.

English summary

 Telugudesam Party senior leader and MP CM Ramesh said that YSR Congress Party chief YS Jaganmohan Reddy's graphe decreasing day by day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X