జయప్రద: జగన్‌కు యస్, బాబుకు నో వెనుక!

సంవత్సరం క్రితం తిరుమలకు వచ్చిన ఆమె టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పొగడ్తలలో ముంచారు. ఆయన పాలనను అభినందించారు. అదే విధంగా హీరో బాలకృష్ణ అంటే ప్రత్యేక అభిమానం అన్నట్లుగా చెప్పారు. ఆ వ్యాఖ్యలతో ఆమె టిడిపిలో మళ్లీ చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత అయితే టిడిపిలో లేదా జగన్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. సంవత్సరం క్రితం బాబు పాలనను పొగిడిన ఆమె మొన్న ఆయన సినీ తారలను వాడుకొని వదిలేస్తారని ఆరోపించారు.
దీంతో ఆమె జగన్ పార్టీలోకి వెళ్లేందుకు దాదాపు సిద్ధమైపోయినట్లే అంటున్నారు. ఆమె జగన్ పార్టీలో చేరడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ హవా కొనసాగుతుండటం, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్న సర్వే రిపోర్టుల నేపథ్యంలో ఆమె జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో టిడిపి చీఫ్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా జయప్రద టిడిపిలోకి రావడాన్ని తిరస్కరించినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications